కబీర్ దాస్ దోహాలు

హిందీలో అత్యంత  ప్రాచుర్యం పొందిన  దోహాలు ( కబీర్ దాస్)  (अत्यंत जन प्रचलित दोहे) :
1.काल करे सो आज कर, आज करे सो अब।
पल में परलय होयगी, बहुरी करौगे कब

    కాల్ కరే సొ ఆజ్ కర్, ఆజ్ కరే సొ అబ్|
    పల్ మే పరలై హోయగీ, బహురీ కరౌగె కబ్||
సుమధుర భావం: ఈ దోహా లో కబీర్ దాస్ సమయం యొక్క ప్రాధాన్యతను గురించి వివరించారు.  సమయం చాలా అమూల్యమైనది.  గడచిన సమయం మళ్లీ తిరిగి రాదు. కావున రేపు చేయాల్సిన పనిని ఈ రోజు, ఈ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయమని ఉద్బోధిస్తున్నారు. సరైన సమయంలో పనులు చేయనిచో కొన్ని పనులు ఆగి పోతాయి. ఒక్క క్షణంలో ఎప్పుడైనా ప్రళయం సంభవించి ఏ పనులూ పూర్తి చేయకుండానే మరణం సంభవించవచ్చు. ఎందుకనగా జీవితం క్షణభంగురం. కనుక  ఏ పనులనూ ఆలస్యం చేయకుండా  "సకాలంలో పనులు పూర్తి చేయుట" మానవుల ధర్మం.

2.गुरु गोविंद दोऊ खडे, काके लागौ पाय।
बलिहारी गुरु आपने, गोविंद दियो बताय॥

    గురు గోవింద్ దోవూ ఖడే, కాకే లాగౌ పాయ్|
    బలిహారీ  గురు ఆపనే, గోవింద్ దియో బతాయ్|

సుమధుర భావం: ఈ దోహా లో కబీర్ దాస్ గురువు యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పారు.  గురువు, గోవిందుడు(భగవంతుడు) ఇద్దరిలో ఎవరు గొప్ప అనే మీమాంస లో గురువుకే ప్రాధాన్యత కల్పిస్తానని వివరించారు. ఒకానొక సమయంలో శిష్యునికి  గురువు మరియు  గోవిందుడు ఇద్దరు ఎదుట పడితే మొదటగా గురువుకే నమస్కారం చేస్తానని ప్రబోధించారు. ఎందుకనగా మనకు భగవంతుడి గురించి తెలియకముందే ఆ భగవంతుని గురించిన జ్ఞానాన్ని గురువే కలుగచేస్తాడు. కావున భగవంతుని కన్నా  భగవత్ మార్గాన్ని చూపించే గురువే గొప్ప. 

3.यह तन विष की बेलरी, गुरु अमृत की खान ।
सीस दिये जो गुरु मिले, तो भी सस्ता जान॥

    యహ్ తన్ విష్ కీ బేలరీ, గురు అమృత్ కీ ఖాన్|
    సీస్ దియే జో గురు మిలై, తో భీ సస్తా జాన్||

సుమధుర భావం: ఈ దోహా లో కబీర్ దాస్  మానవ జీవితంలో గురువు ప్రాముఖ్యతను వివరించాడు. 4.गुरु कुम्हार सिष कुंभ है, गड-गड काटौ खोट।
अंदर हाथ सहारिदै, बाहर बाहै चोट॥

    గురు కుమ్హార్ సిష్ కుంభ్ హై, గడ్ గడ్ కాటై ఖోట్|
    అందర్ హాథ్ సహారి దై, బాహర్ బాహై చోట్|

సుమధుర భావం :ఈ దోహా లో కబీర్ దాస్  గురువు ప్రాముఖ్యతను వివరించాడు.

5.सब धरती कागज करूँ, लेखनी सब बनराय।
सात समुद्र की मसि करूँ, गुरुगुन लिखा न जाय॥

    సబ్ ధరతీ కాగజ్ కరూ, లేఖనీ బనరాయ్|
    సాత్ సముద్ర్ కీ మసి కరూ, గురుగుణ్ లిఖా న జాయ్||

సుమధుర భావం: ఈ దోహా లో కబీర్ దాస్  గురువు ప్రాముఖ్యతను వివరించాడు. 

6.गुरु समान दाता नहीं, याचक सीष समान।
तीन लोक की सम्पदा, सो गुरु दीन्ही दान॥

    గురు సమాన్ దాతా నహీ, యాచక్ సీష్ సమాన్|
    తీన్ లోక్ కీ సంపదా, సో గురు దీన్హి దీన్||

సుమధుర భావం: ఈ దోహా లో కబీర్ దాస్  గురువు ప్రాముఖ్యతను వివరించాడు. 

( भक्ति पद्धति / बाह्याडंबर का विरोध ) భక్తి పద్ధతి, బాహ్యాడంబరాలకు ఖండించుట
7.पाहन पूजे हरि मिलै, तो मै पूजूँ पहार।
ताते यह चक्की भली, पीस खाय संसार॥

    పాహన్ పూజే హరి మిలై, తో మై పూజూ పహార్|
    తాతే యహ్ చక్కీ భలీ, పీస్ ఖాయ్ సంసార్||

సుమధుర భావం: ఈ దోహా లో కబీర్ దాస్ బాహ్యాడంబర భక్తి ని ఖండించారు. 

8.लाली मेरे लाल की, जित देखो तित लाल।
लाली देखन मैं चली, मै भी हो गय लाल।

    లాలీ మేరే లాల్ కీ, జిత్ దేఖో తిత్ లాల్|
    లాలీ దేఖన్ మై చలీ, మై భీ హో గయి లాల్||

సుమధుర భావం: ఈ దోహా లో కబీర్ దాస్ భక్తి ని గురించి వివరించారు. 

9.जाके राखै साइयाँ, मार सकै न कोय।
बाल न बंका करि सकै, जो जग बैरी होय।

    జాఖే రాఖై సాయియా, మార్ సకై న కోయ్|
    బాల్ న బాంకా కరి సకై, జో జగ్ బైరీ హోయ్||

సుమధుర భావం: ఈ దోహా లో కబీర్ దాస్ భగవత్కృపను గురించి వివరించారు

10.जाति न पूछो साधु की, पूछ लीजिए ज्ञान।
मोल करो तलवार की, पडा रहन दो म्यान॥

    జాతి న పూఛో సాధు కీ, పూఛ్ లీజియే జ్ఞాన్ |
    మోల్ కరో తల్వార్     కీ, పడా రహన్ దో మ్యాన్||

సుమధుర భావం:  ఈ దోహా లో కబీర్ దాస్ సాధువు కులం గురించి వివరించారు.



7 comments:

  1. dear suman I think ,in kabir das 10th dohe the meaning is not clearly mentioned as the original meaning is, so some precautions must be taken when it is put in .I wish you all the best.

    ReplyDelete
  2. "mo ko kahan dhunno bandi".
    o servent where dost thou seen me.Lo i am beside thee. iam neither in temple nor in mosque. i am neither in kabba nor in khailasa.

    thanks. it is very usseful to us. thank u once again

    ReplyDelete
  3. Dear Sir
    Hat off to you for your great efforts of translations
    good luck

    ReplyDelete
  4. చాలా అద్భుతమైన కబీర్ దాస్ గారి దోహాలు దోహా మాధురీ గారికి కృతజ్ఞతలు

    ReplyDelete
  5. చాలా అద్భుతమైన కబీర్ దాస్ గారి దోహాలు దోహా మాధురీ గారికి కృతజ్ఞతలు

    ReplyDelete
  6. Sir Inka inter lo ni Kabir story kuda cheppandi

    ReplyDelete
  7. అద్భుతమైన కబీర్ దాస్ గారి దోహాలు దోహా మాధురీ గారికి కృతజ్ఞతలు

    ReplyDelete